Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐపీఎల్ ఆపేయాలన్న పిటీషన్ పై సుప్రీం విచారణ

ఐపీఎల్ మ్యాచ్ లు నిలిపేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్ పై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇకపై జరుగబోయే మ్యాచ్ లు నిలిపేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. మరో వైపు ఐపీఎల్ ను బ్యాన్ చెయ్యాలంటూ కొన్ని చోట్ల నిరసనలు రేగుతున్నాయి. క్రికెట్ లో వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయని అభిమానులు మండి పడుతున్నారు. ప్రతిష్ట మసకబారుస్తున్న ఆటగాళ్ళ వల్ల దేశానికి చెడ్డపేరు వస్తోందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News